తహసిల్దార్‌‌ కార్యలయం ముందు ఆశ వర్కర్ల సమ్మె*

చిట్యాల, నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఆశ వర్కర్ల డిమాండ్ పరిష్కరించాలని ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న 34 మంది ఆశా వర్కర్లు తహసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు
ఈ సందర్భంగా ఆశ వర్కర్ల మండల అధ్యక్షు కార్యదర్శులు రాధిక, సాయి వేద మాట్లాడుతూతెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె నిర్వహించవని ఈ ప్రభుత్వం అనేకసార్లు ఆశా వర్కర్లు ధర్నాలు చేసిన సమ్మెలు చేసిన పట్టించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఆశ వర్కర్లు నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి ముఖ్యంగా నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వలన ఆశ వర్కర్ల జీతాలు 18 వేల రూపాయలు పెంచి ఫిక్స్డ్ వేతనం చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మినెంట్ చేయాలని ఆరు నెలల పిఆర్సి బకాయిలు ఇవ్వాలని కరోనా రిస్క్ అలవెన్స్ 16 నెలలవి ఇవ్వాలని నాణ్యమైన డ్రెస్సులు ఇవ్వాలని ఏఎన్ఎం జిఎన్ఎమ్ ట్రైనింగ్ చేసిన ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలని టిబి తెమడ డబ్బాలను ఆశలతో మోపించరాదు పారితోషకాలు లేని పనులను ఆశ వర్కర్లతో చేయించకూడదు పై డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి లేనియెడల గతంలో ఆశ వర్కర్లు 106 రోజుల సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి జీతాలు పెంచుకోవడం జరిగింది ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఆశ వర్కర్లు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నిరవధిక సమ్మెను పొడిగించకుండా తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలి లేనియెడల ఈ వర్షాకాలం సీజన్లో చాలామంది ప్రజలకు జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగీ రావడం జరుగుతుంది కాబట్టి గతంలో కరోనాకాలంలో కూడా ఆశ వర్కర్లు నిత్యం ప్రజల మధ్యన ఉండి పని చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటిదాకా ప్రజల మధ్యన ఉండి పని చేస్తున్న ఆశ వర్కర్లు సమ్మెకు పోవడం వలన ప్రజలకు గర్భిణీ స్త్రీలకు అందరికీ చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీని చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో , ఆశా వర్కర్లు సాయి వేద సుమలత రజిత సుజాత లావణ్య కల్పన భాగ్య పార్వతి రామ కళ్యాణి స్రవంతి సునీత విశాల విజయ కృష్ణవేణి కమల లక్ష్మి సరోజన ప్రమీల మానస అనిత స్వప్న జ్యోతి తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *