సిఐటి యూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు

-జిల్లా మధ్యాహ్న భోజన రంగా కార్మికుల సమస్యలపై

-జిల్లా డీఈఓ కి సమ్మె నోటీసు

బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం 2024, ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బందు విజయవంతం చేయాలని కార్మికుల రంగాలకు పిలుపు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన కార్మికులకు వారి డిమాండ్లను నెరవేర్చడంలో గత ప్రభుత్వం విఫలమైన సందర్భంలో, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ నెరవేర్చాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు అనుబంధం మధ్యాహ్న భోజన రంగం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.

1, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి.
2, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి, అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలి.

3, మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలి.
4, అక్రమ తొలగింపులు అరికట్టాలి, రాజకీయ వేధింపులు ఆపాలి.
5, వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి.
6, కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి, సామాజిక భద్రత కల్పించాలి.

7, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
8, మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు బ్యాంకులో రుణం తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్య దర్శి గురిజాల శ్రీధర్, సీఐటీయూ అధ్యక్షులు ఎగ మటి ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!