# యువత మత్తు పదార్థాలు బానిస కావద్దు.
# యువత పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి
# శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి.
# పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తా.
# నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు.
# విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ రమణమూర్తి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ప్రాంతంలో జంజాయి సేవించిన,విక్రయించిన చట్టపరమైన
కఠిన చర్యలు తప్పవని నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి హెచ్చరించారు.మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై రాజుతో కలిసి టౌన్ సీఐ మాట్లాడుతూ రోజురోజుకు యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని దీంతో వారి బంగారు భవిష్యత్ పాడుచేసుకుంటున్నారని తెలిపారు.యువతకు,విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు.పిల్లల రోజువారీ పనుల పట్ల నిత్యం చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పేర్కొన్నారు.నర్సంపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు దీనికి ప్రజలు సహకరించాలని సీఐ కోరారు.నేరాల నియంత్రణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.సీసీ కెమెరాలు నిర్వహణ,వాటి పని విధానాలను పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు.నర్సంపేటలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మత్తు పదార్థాలు,నేరాల నియంత్రణ పట్ల సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా టౌన్ సీఐ రమణమూర్తి ప్రజలను కోరారు.