
CI Bansilal.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు
చెన్నూరు రూలర్ సిఐ బన్సీలాల్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి మండలాలలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన,ఉద్దేశ్య పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు.అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా,పిడిఎస్ బియ్యం రవాణా,గుడుంబా రవాణా చేయడం,గంజాయి అమ్మకం సేవించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు చేపట్టి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.చట్టాన్ని అతిక్రమించి గొడవలకు పాల్పడడం,ఉదేశ్య పూర్వకంగా దాడులకు పాల్పడుతూ,శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు చేపట్టి అటువంటి ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి వుంటూ పోలీస్ వారికి సహకరించాల్సిందిగా చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి,నీల్వాయి ఎస్సై లు రాజేందర్,శ్యామ్ పటేల్ తెలిపారు.