Strict Enforcement of Election Code
మండలం లో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం
ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి
నిషేధిత వస్తువుల రవాణా పై నిఘా
సోషల్ మీడియా నందు అసత్య ప్రచారాలు చేసిన ఇతర వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు
ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రభాను
గుండాల సీఐ రవీందర్, ఎస్సై రహూఫ్
గుండాల,నేటిధాత్రి:
సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, నియమనిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తాము. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున మండల ప్రజలు, పౌరులు, రాజకీయ పార్టీలు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుంది అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలాగా జరగాలని అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత గా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. నియమావళి నిభందనలు ప్రకారం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడుతున్నాం, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి.
ప్రతి పౌరుడు స్వేచ్చగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నిషేదిత వస్తువులు అక్రమ మద్యం, నాటు సారా, డబ్బు, దృవపత్రాలు లేని విలువైన ఆభరణాలు, వస్తువులు అక్రమ రవాణా జరగకుండా ఉమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాము.
గత ఎన్నికలలో కేసుల్లో ఉన్న నెరస్థులను ముందస్తుగా బైండోవర్ చేయడం, సమస్యలు సృస్థించే ట్రబుల్ మాంగర్స్ లను ముందస్తు బైండోవర్ చేస్తాం.సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సృష్టించడం లాంటివి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంభందిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్ లపై చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు.
ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోరాదు.
ఎన్నికల ప్రచారంలో అశ్లీల, అసత్య, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదు.
నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం చట్టవిరుద్ధం అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదు.
సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి అన్నారు గుండాల సిఐ ఎల్ రవీందర్, ఎస్సై సైదా రవూఫ్ ఉన్నారు.
