Police Warn Social Media Misuse
సోషల్ మీడియాలో.. రెచ్చగొడితే కఠిన చర్యలు
గొడవలు జరిగితే.. గ్రూప్ అడ్మిన్ బాధ్యత.
ఎస్సై లెనిన్ గౌడ్.
బాలానగర్ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులో పోలీసుల నిఘా ఉంటుందని ఎస్సై లెనిన్ గౌడ్ సోమవారం అన్నారు. రాజకీయ పార్టీలను కానీ ఇతర నాయకులను గాని కించపరిచే విధంగా పోస్టులు పెట్టకూడదన్నారు. వాట్సాప్ గ్రూపులో గొడవలు జరిగితే గ్రూప్ అడ్మిన్ ది బాధ్యత అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పోలీస్ సిబ్బందికి, ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు.
