
Police Warn Farmers Against Drying Paddy on Roads
రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.