నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.
జహీరాబాద్ నేటి ధాత్రి;
నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.