అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి (ఐ.పి.ఎస్) హెచ్చరిక
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
ఈరోజు అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లను ప్రమోట్(ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలి. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ లు, బెట్టింగ్ ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి ఐ.పి.ఎస్ తెలిపారు. అంతేకాకుండా యువత, మరియు విద్యార్థులు చదువు మీద దృష్టి సాధించి, తమ తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత కొలువుల కోసం పాటుపడాలని జిల్లా ఎస్పీ గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని,అక్రమ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఆడిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.ఈ మెరకు జిల్లా ఎస్పీ సోషల్ మీడియా పై అవగాహన కార్యక్రమం మరియు శనివారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.