డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు

డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్ల పై సమీక్షా..

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్‌ల జాబితాను సిద్ధం చేయాలని,

 

 

సంబంధిత మిల్లర్లపై రీవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య నాదెళ్ల ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్లపై తహసిల్దార్లు,
సివిల్ సప్లై డిఎం,డిసిఎస్ఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి సంధ్యారాణిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

 

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలు,మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని,రేషన్ కార్డుల్లో నెంబర్ యాడ్ చేయుట అంశాలపై పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

 

 

రేషన్ షాప్ ల ఖాళీల భర్తీకై ప్రభుత్వ నిబంధనల మేరకు ఖాళీలను భర్తీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు.రేషన్ కార్డు లబ్ధిదారులలో డెత్ కేసులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీల నుండి నివేదికలు సేకరించి వాటిని పర్యవేక్షించి పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.భూభారతి ధరకాస్తు పరిష్కారంపై సంబంధిత తాసిల్దార్లతో మాట్లాడుతూ వివిధ మండలాలలో రెవెన్యూ సదస్సుల నిర్వహణలో సేకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

జిల్లాలో మహిళా శక్తి స్వయం సహాయక బృందాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు కల్పించే ఉద్దేశ్యంతో మహిళా పెట్రోల్ బంక్ స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసిల్దారులను ఆదేశించారు.పీఎం కుసుమ ప్రాజెక్ట్ కింద సోలార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మండలానికి 5 ఎకరాల చొప్పున ప్రభుత్వ స్థలాన్ని సేకరించి గ్రీనరీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

 

ఈ సమీక్షలో వరంగల్ ,నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, డీసిఎస్ఓ కిష్టయ్య, సివిల్ సప్లయ్ డిఎం సంధ్యారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!