గుండాల సిఐ రవీందర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండలంలోని దామెర తోగు గ్రామాన్ని గుండాల సీఐ రవీందర్ విజిటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
ఇబ్బందులకు గురికావద్దని హెచ్చరించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులను తరిమి కొట్టాలని అన్నారు.అదేవిధంగా వారోత్సవాల కల్వర్ట్స్ ను కూడా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ పోలీస్ సిబ్బంది మంగయ్య, వెంకటేశ్వర్లు, స్పెషల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.