అధికారులు వెంటనే పట్టించుకోవాలి
వీణవంక,( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇండ్ల మధ్యలోకి మురికి నీరు చేరి ప్రజల రోగాల బారిన పడేస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండల కేంద్రంలో గత నెల రోజుల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైడ్ డ్రైనేజీలు పూర్తిగా తొలగించడం వల్ల రెండు రోజులు కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో డ్రైనేజ్ నిండి మురికి నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు బెడద ఎక్కువ అయింది . వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ఇండ్ల మధ్యలోకి మురికి నీరు రాకుండా చూడాలని ప్రజలు అధికారులను గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.