కుమార్ పల్లి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ సమీపంలో విచ్చలవిడిగా కుక్కలు
కుక్కలని నియంత్రించాల్సిన నగరపాలక సంస్థ, అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది
భయపడుతున్న తోటబడి స్కూల్ సమీప ప్రాంత ప్రజలు
రోడ్డుమీద నడవాలి అంటే ప్రాణాలని అరిచెతిలో పెట్టుకోవాల్సిందే
హనుమకొండ, నేటిధాత్రి:
హనుమకొండ కుమార్ పల్లి లో కుక్కల గుంపు స్వైర విహారం చేస్తున్నాయి .సెయింట్ జోసెఫ్ హై స్కూల్ చుట్టుపక్కల నివాస ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే వణికి పోతున్నారు..
కుమార్ పల్లి లోని తోటబడి స్కూల్ సమీప ప్రాంతంలో వీధి కుక్కలు విచ్చలవిధిగా తిరుగుతున్నాయని అక్కడి ప్రాంత ప్రజలు చెప్తున్నారు.
కుక్కల భయానికి ప్రజలు రోడ్ల మీదకి రావాలంటేనే వణికిపోతున్నారు. వీధి కుక్కల బెడద గురించి వరంగల్ మున్సిపాలిటీ లో చాలా వరకు ప్రజలు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని.. కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతుందని ఏదో ఒక ప్రాంతంలో చిన్నపిల్లల మీద వీధి కుక్కలు దాడులు చేసి పిల్లలని చంపేస్తున్నయంటు
కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార యంత్రాంగం కుక్కలని పట్టుకున్నట్లు హడావిడి చేస్తూ మళ్ళీ కుక్కలని వేరే చోట్లలో వదిలేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఈ కుక్కల ద్వారా ఎక్కువ శాతం చిన్నపిల్లలు ప్రమాదానికి గురవుతున్నారని రక్తానికి మరిగినట్లుగా మనుషులపై కుక్కలు దాడి చేస్తున్నాయని ఇకనైనా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని కుక్కల బెడద నుంచి తమని రక్షించాలని ప్రజలు అంటున్నారు.