
US Tariffs on Shrimp: India’s Strategic Response
*రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు..
*ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన..
తిరుపతి(నేటి
ధాత్రి)సెప్టెంబర్
18:
ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రస్తావించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా రొయ్య రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, తిరుపతి జిల్లాలోనే 28 వేల ఎకరాల్లో సుమారు 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఎంపీ కేంద్రానికి వివరించారు.
ఈ విషయంపై సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత, మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా)తో చర్చించి పలు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. అమెరికా పరస్పర సుంకాల నిర్ణయం నేపథ్యంలో ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధిక విలువ కలిగిన సముద్ర జాతుల ఉత్పత్తి వైపు దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో సీబాస్, కోబియా, పొంపానో, క్రాబ్, తిలాపియా, గ్రూపర్, బ్లాక్ టైగర్,స్కాంపి వంటి జాతులను ప్రోత్సహిస్తోందన్నారు. తద్వారా ఆక్వాకల్చర్ రైతుల ఆదాయ భద్రతను పెంచి, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో టారిఫ్ల కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలియజేశారుఅంతేకాకుండాఎంపెడా ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను గుర్తించడం తోపాటుగా, ఇప్పటికే ఉన్న మార్కెట్లను విస్తరించే దిశగా కృషి చేస్తోందన్నారురైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా విదేశీ ప్రదర్శనలు, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు, వాణిజ్య ప్రతినిధి బృందాల ద్వారా చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపిందని తెలియజేశారుఆక్వా రైతుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపి, మార్కెట్ యాక్సెస్ పెంపు, టారిఫ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.