నేటి ధాత్రి / హసన్ పర్తి
హన్మకొండ పట్టణం లో వింత ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెల కుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కే యూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతి మరొకరు పట్టుకొని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనర్హం కాగా నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఓ వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడని బయటికి తీస్తున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు అవాక్కయ్యారు పోలీసుల సమయం మరియు 108 సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.