Mysterious Disease Spreads Among Stray Dogs in Kohir
కోహిర్ లో కుక్కలకు వింత రోగం
◆-: గ్రామాల్లో భయం భయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని పలు గ్రామాలలో బిలాల్పూర్, మనియార్పల్లి, దిగ్వాల్, సజ్జపూర్, బడంపేట్ తదితర గ్రామాల్లో వీధి కుక్కలు అనా రోగ్యానికి గురవుతూ బక్కచిక్కి అంద వికారంగా మారిపోతు న్నాయి. ఏదో తెలియని వైరస్ బారిన పడినట్టు కనిపిస్తున్న ఈ కుక్కలు వెంట్రుకలు రాలిపోయి, బలహీనంగా కదులుతూ గ్రామస్థు లను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో ఈ వైరస్ వ్యాప్తి, పురుగులు పడటం వంటి సమస్యలు కలకలం రేపుతు న్నాయి. ముఖ్యంగా వీధి కుక్కల నుంచి మనుషులకు ఏదైనా అంటు వ్యాధి సోకుతుందేమోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఈ సమస్యపై స్థానికంగా జంతు వైద్యులు జోక్యం చేసుకుని చికిత్స అందించాలని, వ్యాధి కారణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీ వల తెలంగాణలో వీధి కుక్కల సమస్య పెరిగిపోతుండటంతో, ఈ కొత్త వైరస్ ఆందోళన మరింత పెంచింది. అధికారులు త్వరగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
