Montha Cyclone Havoc in Nekkonda — Farmers Devastated
తుఫాన్ బీభత్సం
నెక్కొండ మండలంలో భారీ నష్టం
#నెక్కొండ,నేటి ధాత్రి :
మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెక్కొండ, నర్సంపేట, కేసముద్రం, చంద్రుగొండ పరిసర గ్రామాలు వాగులు, వరదలతో చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పనికర రైతులు వట్టేవాగు వెంబడి సుమారు 500 ఎకరాల పైన పంట నీట మునిగింది .ఈ పంట మొత్తం పది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రమైన ఆవేదన అవుతున్నారు. పనికర గ్రామానికి చెందిన బుర్ర సమ్మిరెడ్డి సంజీవ గర్నెపల్లి రామిరెడ్డి ,సుదర్శన్ రెడ్డి, రాజనర్సింహారెడ్డి, రేగుల ప్రతాపరెడ్డి పైండ్ల రాములు, మధు ,లక్ష్మయ్య, కమలమ్మ,సింగం సమ్మయ్య ఒగ్గుల దేవేందర్ ,ప్రభాకర్, దూదిపాల బాబు, బిక్షపతి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గడ్డ బోయిన కుమారస్వామి, కాశబోయిన కుమార్, కొత్త మోహన్ రెడ్డి, రైతుల
పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనికర గ్రామానికి చెందిన రైతు బుర్ర సమ్మిరెడ్డి, భార్య సరోజన ,దంపతులు వేదనతో చెబుతూ “నాలుగు రోజులైతే కోయాల్సిన పంట వట్టే వాగులో కొట్టుకుపోయింది. లక్షల్లో నష్టం జరిగింది. కొద్ది నెలల క్రితం చనిపోయిన మా చిన్నకొడుకు చేసిన అప్పులు తీర్చే అవకాశం ఈసారి వస్తుందని అనుకున్నాం, కానీ మళ్లీ దెబ్బతిన్నాం” అని కన్నీటి స్వరంతో తెలిపారు.
పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందని చెబుతున్నారు. అధికారులు గ్రామాల పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.
