సర్పంచ్ ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి డి ఐ జి ఆదేశాలు
వనపర్తి: నేటిదాత్రి .
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లాఎస్పీ, ఏ ఆర్ అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లలతో జోగులంబ జోన్ డిఐజి కార్యాలయంలో డీఐజీ *ఎల్ఎస్, చౌహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తి
జిల్లాలో మద్యం అక్రమ రవాణా జరగకుండా పోలీస్ చెక్ పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల ధైర్యం నింపాలన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల నమ్మక పెంచాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ చేయాలన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి, మద్యం అక్రమ రవాణాలను గ్రామల సర్పంచ్ ఎన్నికలలో ఇబ్బందులు కలిగించే వారిని బైండోవర్ చేసి కట్టడం చేయాలన్నారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని,అన్నారు
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ, సునిత రెడ్డి,, ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిఎస్పి, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్ వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరుసీఐ, శివకుమార్ పోలీసు అధికారులు సిఐలు పాల్గొన్నారు.
