పల్లా దేవేందర్ రెడ్డి AITUC రాష్ట్ర కార్యదర్శి డిమాండ్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి::
అంగన్వాడీ కేంద్రాలు పై దాడులు చేస్తూ తాళాలు పగలకొడుతున్న అధికారులు తక్షణమే ఈ దాడులు ఆపాలని. AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం అంగన్వాడీ ల ఐదవ రోజు సమ్మె లో బాగంగ చండూరు MRO కార్యలయం .ముందు జరిగిన కార్యక్రమమం లో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ
ఐదు రోజులుగా రాష్ర్టంలో AITUC _CITU ఆధ్వర్యంలో అంగన్వాడి లు సమ్మె చేస్తున్న చర్చలు జరపకుండా icds కమిషనర్ ,ప్రభుత్వం అంగన్వాడీ లపై వత్తిడి తెస్తూ జిల్లా లో pd ల ను సీడీపీఓ ల ఎంపిడివో ల నుంచి వత్తిడి చేపిస్తున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వం పోరాటం చేసే సంఘాల తో చర్చలు జరపకుండ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం విచారకరమని అన్నారు.
ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చూపకుండా సమ్మె విచ్చిన్నం చెయ్యాలను కోవటం తగదు అని అన్నారు.సెంటర్ల తాళాలు ఇవ్వాలి అని బలవంతం చేస్తు,తాళాలు పగల గొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు.
గత 48 ఏళ్లుగా icds లో గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరి చేపిస్తూ మహిళల శ్రమ దోపిడీ పాలకులు చేస్తున్నారు అని అన్నారు .
భద్రత లేని బ్రతుకులు చాలి చాలని వేతనము తో ఇంకా ఎన్ని ఏళ్ళు పనిచేయాలి అని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కనీస వేతనము 26వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు పది లక్షలు ఆయాకు ఐదు లక్షలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, భీమా వర్తింపజేయాలని, పెండింగ్లో ఉన్న టీఏ డీఏలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నలపరాజు రామలింగయ్య,, , సీపీఎం మండల కార్యదర్శి ఎం వెంకటేశం, సిఐటియు సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్న,సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకన్న,,అంగన్ వాడి యూనియన్ నాయకులు సత్తమ్మ, తారక, నాగమణి, రమణ,జగదేశ్వరీ ,కేదారి,సునిత, తదితరులు పాల్గొన్నారు.