
Collector Dr. Satya Sarada.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో
విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.