రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జమ్మికుంట ఎమ్మార్వోకు బిజెపి నాయకులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తోడు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో మా ప్రాంతంలోని రైతులకు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. బిజెపి జిల్లా నాయకత్వం పిలుపు మేరకు రైతుల ఇబ్బందులు తెలుసుకొని రెండు రోజులుగా వడ్ల కల్లాల సందర్శనకు వెళ్లడం జరిగిందని, రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసామన్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మానుకొని కొన్ని రోజులుగా అడిగాపులు కాస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అకాల వర్షం నుంచి కాపాడేందుకు సరిపడా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో పదేపదే తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు తిండి తిప్పలు మాని అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని హామీ మరిచిందని. వెంటనే 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా 15 వేల రూపాయలు, అలాగే 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు
పల్లపు రవి, కైలాసకోటి గణేష్, ఇటుకల స్వరూప, తూడి రవిచంద్రరెడ్డి, కొమ్ము అశోక్, కొండ్లె నగేష్, మోడం రాజు, గిరవేణి విజేందర్, బూరుగుపల్లి రామ్, గర్రెపల్లి నిరుపరాణి, పత్తి జనార్దన్ రెడ్డి, ముకుంద సుధాకర్, వీణవంక శివ, దార కృష్ణ, బద్రి, కుంభాల వెంకటరాజా, అప్పల రవీందర్, ఎర్ర వెంకటేష్, ఆకుల కిషన్, యాంసానీ సమ్మయ్య, వేముల జగన్, ఏ సృజన, తాళ్లపెళ్లి తిరుపతి, కేశ స్వరూప, ఏ రామస్వామి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *