
Pochamma and Balamma temple.
జహీరాబాద్ లో పోచమ్మ, బాలమ్మ విగ్రహ ప్రతిష్ట.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం వెంకటరమణ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ, బాలమ్మ విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా వచ్చే నెల 1,2,3 తేదీలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీన స్వస్తి, పుణ్యావచన, నాంది, నవగ్రహ పూజతో పాటు పోచమ్మ, బాలమ్మ యంత్రం విగ్రహ ధాన్యాది వాసం, 2వ తేదీన బాలమ్మ, పోచమ్మ దేవతల పూజ, చండి హోమం, జలాధివాసం 3వ తేదిన సయ్యాది పుష్పవాసం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటాయని వివరించారు. ఉత్సవాల చివరి రోజు హౌసింగ్ బోర్డు కాలనీ, వెంకటరమణ కాలనీ లోని ప్రతి ఇంటినుండి బోనం సమర్పించాల్సిందిగా విజ్ఞాపించింది. ఈ బోనం సమర్పించే కార్యక్రమం హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభం అవుతుందని వివరించింది.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఝరాసంగం మండలం బర్దిపూర్ ఆశ్రమం పీఠాధిపతి 1008 వైరాగ్య శిఖామణి శ్రీ అవధూత గిరి మహారాజ్, న్యాల్కల్ మండలం ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ దేవగిరి మహారాజ్,మల్లన్న గట్టు ఆశ్రమం పీఠాధిపతి శ్రీ బసవలింగ అవధూత మహారాజ్, మొగుడంపల్లి మండలం ధనసిరి హీరేమట్ ఆశ్రమ 108 పీఠాధిపతి శ్రీ వీరేశ్వర్ శివాచర్య మహారాజ్, న్యాల్కల్ మండలం న్యామతబాద్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివానందగిరి మహారాజ్ ల సమక్షంలో జరుగుతాయని వివరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరడం జరిగింది.