పాలకుర్తి నేటిధాత్రి
జిల్లా గవర్నర్ లయన్ ఎన్. వెంకటేశ్వర్ రావు సతీమణి, లయన్స్ జిల్లా ప్రధమ మహిళా నడిపెల్లి లక్ష్మి, పూర్వ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి పుట్టిన రోజుల సందర్బంగా, సేవభారతి మహిళా క్లబ్ ధత్తత గ్రామమైన తీగారం గ్రామ ప్రాధమిక పాఠశాల లోని విద్యార్థిని, విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు చెన్నూరి అంజలి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రీజియన్ చైర్మన్ రాపాక విజయ్, రీజియన్ కార్యదర్శి బజ్జురి వేణుగోపాల్, సర్పంచ్ పోగు రాజేశ్వరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కుమార్, జీపీ కార్యదర్శి తదితరుల చేతుల మీదుగా నోట్ బుక్స్, పెన్స్ తో పాటు ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బ్యాగులు, బిస్కిట్స్, ఆట వస్తువులు పంపిణి చేశారు. ఇక ముందు కూడ పాఠశాల అభివృద్ధికి సహాయం చేస్తామని, గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని తెలిపారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీవిద్య, క్లబ్ కార్యదర్శి రాపాక నీలిమ, కోశాధికారి దేవసాని విమల దేవి, క్లబ్ ఉపాధ్యక్షులు అల్లాడి వాసవి, ఉపాధ్యాయులు, ఆయాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.