“పాలిసెట్ లో భవానికి స్టేట్ ర్యాంక్”

పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్
సిరిసిల్ల, జూన్ – 3(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణలో సిరిసిల్ల ప్రగతి నగర్ కు చెందిన మార్గం భవాని రాష్ట్ర స్థాయిలో 373 ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
60 మంది విద్యార్థులు పోపా ఉచిత శిక్షణలో పాల్గొని అత్యున్నత ర్యాంకులు సాధించినట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నంచందర్ తెలిపారు.
5000 వేల లోపు ర్యాంకులను 26 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు.
10 వేల లోపు ర్యాంకులను 41 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు.
మార్గం భవాని 373 ర్యాంకు, గాలి భానుశ్రీ 1395 ర్యాంకు, మామిడాల నందిని 1960 ర్యాంకు, గుండ్లపెల్లి వర్ధన్ 2616 ర్యాంకు, చేర్యాల చక్రధర్ 2963 ర్యాంకు, ఒగ్గు సుశాంత్ 3309 ర్యాంకు, బొద్దుల అద్వైత, గుండెల్లి సిరి, గడ్డం శివ క్రిష్ణ, ఇప్పనపెల్లి హర్షిత్, మిట్టపల్లి తరంగిణి, ఆమిదాల అనుష లు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు పున్నంచందర్ తెలిపారు.
పోపా ద్వారా ఉచిత పాలిసెట్ శిక్షణ పొందిన వారిలో 95 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో సీటు వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పాలి సెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఉచితంగా శిక్షణ అందించిన ఉపాధ్యాయులను పాలి సెట్ కోర్స్ డైరెక్టర్స్ మండల విద్యాధికారి దూస రఘుపతి, గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, కనుకుంట్ల పున్నం ఛందర్, మామిడాల భూపతి, వాసాల హరిప్రసాద్, అడేపు వేణు, భైరి రవీందర్, కనుకుంట్ల తిరుమల, ఆంకారపు జ్యనోభ,గెంట్యా ల భూమేష్, సామల తిరుపతి, కోక్కుల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్,కొడం రాం ప్రసాద్,బొల్లి భగవాన్, కనుకుంట్ల మధు, గడ్డం సత్యం, దుస శ్రీనివాస్ , జక్కనీ నవీన్, చిట్యాల రత్నాకర్, చేరాల ప్రభాకర్ లు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!