నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు,సాధన పరిష్కారాలు పట్ల చర్చించారు.అనంతరం ఉపాధ్యాయులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా
అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.