
Advanced Liver Clinic Opens in Vellore..
నరువిలో అత్యాధునిక లివర్ క్లినిక్ ప్రారంభం
తిరుపతి(నేటి ధాత్రి(ఆగస్టు 13:
వేలూరులోని నరువి ఆసుపత్రిలో ప్రత్యేకంగా గురువారం అత్యాధునిక లివర్ క్లినిక్ నరువి హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ జీవీ సంపత్ ప్రారంభించారుఇక్కడ ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయడానికి అనువుగా పరికరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు అనేకం చేసిన నరువి ఆసుపత్రి, దీనికి గాను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.ఈ సర్జరీలకు ఎల్. క్యూబ్ మెడికల్ టీమ్ సహకరించగా, ఈ టీమ్ కు డాక్టర్ జాయ్ వర్గీస్,డాక్టర్ వివేక విజ్ లు నాయకత్వం వహించారు. వీరు ఇకపై నరువి ఆసుపత్రిలోనే తమ సేవలను అందించనున్నారు.ఈ టీమ్ ఇటీవల ఒకే రోజులొ నాలుగు లివర్ ట్రాన్స్ ప్లాంట్స్ చేసినట్లు ఈ సందర్భంగా డాక్టర్ జీవి సంపత్ తెలిపారు. ఇందులో భాగంగా ఎల్ క్యూబ్,నరువి ఆసుపత్రిల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే లివర్ సమస్యలతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నరువి ఆసుపత్రికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనితా సంపత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పాల్ హెన్రీ, జాకబ్ జోస్, శరవణన్ రామన్, నితిన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.