
మహబూబ్ నగర్: నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పోలేపల్లి సెజ్ లోనీ SVKM’s NMIS పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను 2024-25 కార్యక్రమానికి ముఖ్యఆతిథిగా హజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే వైజ్ఞానిక మెలకువలు విద్యార్థులు నేర్చుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధుసూధన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, శాసనమండలి సభ్యులు ఏబీఎన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, డీఈవో విజయ్ కుమార్ , ఏఎంసీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, ఎంఈఓ మంజులా దేవి, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పాలత పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.