పాల్గొన్న ఎన్.ఆర్.పి.డి ఇండియా రాష్ట్ర,మండలాల అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి(టౌన్) సోమవారం రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సుకు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి ఎన్. ఆర్.పిడి హనుమకొండ జిల్లా అధ్యక్షులు సూదమల్ల ప్రశాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నియోజకవర్గ ఇన్చార్జ్ లాసాని నర్సింగరావు మరియు ఆరు మండలాల ఎన్.ఆర్.పిడి అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగరావు సభకు అధ్యక్షత వహించి,మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి పోస్టల్ ఓట్లు నమోదు కావడంతోపాటు అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి.ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్తించారు.దివ్యాంగులు,80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పించడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో దివ్యాంగులు 5.06 లక్షలమంది.గతంలో కేవలం ఎన్నికల విధుల్లో ఉన్నవారికి,సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండేది.కానీ కరోనా నాటి నుంచి దివ్యాంగులు,80 ఏళ్లు పైబడిన వారికి ఈ అవకాశం కల్పించారు. దీంతో పోస్టల్ ఓట్లు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల్లో ఓట్లు ఉండడంతో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రాష్ట్రస్థాయి సదస్సులో హనుమకొండ జిల్లా ఎన్ ఆ.ర్. పి.డి ఇండియా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక పరకాల మండల అధ్యక్షులు బొల్లారం సంజీవ,నడికూడ మండల అధ్యక్షులు గూడ కొమురయ్య,ఆత్మకూరు మండల అధ్యక్షులు బిక్షపతి, దామెర మండల అధ్యక్షుడు నరసయ్య,గీసుకొండ అధ్యక్షులు సంగీత్ తదితరులు పాల్గొన్నారు.