
జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటా
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 50 వేల,విప్ స్వంతగా 20 ఆర్థిక సహాయం అందజేత
పిల్లల పై చదువులకు, ప్రసాద్ తల్లిదండ్రుల వైద్యానికి భరోసా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల నియోజకవర్గనికి చెందిన టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటానని
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ప్రసాద్ గుండెపోటుతో ఇటీవల మృతిచెందిగా విషయం తెలుసుకున్న విప్ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని, విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా 20 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల పై చదువులకు అండగా ఉంటానని తెలిపారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసాద్ తల్లిదండ్రుల ఆరోగ్య చికిత్సకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప రెడ్డి, డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.