డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ
మంగపేట నేటి ధాత్రి
మండలం లోని రాజపేట గ్రామంలో కెనరా బ్యాంక్ ఉంది, కాని స్టేట్ బ్యాంక్ లేకపోవడం తో స్టేట్ బ్యాంకు ఖాతా దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని కమలాపురం గ్రామంలో, ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు దూర ప్రాంతంలో ఉండటం వలన రాజుపేట, కత్తిగూడెం, బ్రహ్మణపల్లి, ధోమెడ, రమనక్కపేట, అఖినేపల్లి మల్లారం వంటి గ్రామాలకు దూరంగా ఉన్నందున పేద మధ్యతరగతి ప్రజలు పోలేకపోతున్నారన్నారు సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయివేటు వాహనాలలో అధిక ఛార్జీలు పెట్టి పేద మధ్య తరగతి ప్రజలు బ్యాంకుకు పోతున్నారని తెలిపారు. రాజపేట కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల ప్రజలు, మండల లోని కమలాపురం ,ఏటూరు నాగారం వెళ్లలేక ప్రజలు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సేవలను వినియోగించుకోలేక పోతున్నారు వెంటనే రాజుపేట కేంద్రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు సురేష్, నవీన్, కేశవ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు