జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు
ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా కొనుగోలు కేంద్రం ఉండాలని అధికారులకు సూచించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు దళారులు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జరిగింది ఇట్టి కార్యక్రమములో , మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరు స్వప్న, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి, తాసిల్దార్ రమేష్, మార్కెట్ సెక్రెటరీ మల్లేష్,మరియు అగ్రికల్చర్ ఆఫీసర్,హమాలి అధ్యక్షుడు రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్లు,సొసైటీ డైరెక్టర్లు, మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది