
స్టార్ హీరోయిన్స్ కే తప్పలేదు.. నువ్వెంత అనుపమ
ఆడదాని గురించి ప్రతి ఒక్కరు సూక్తులు చెప్తారు కానీ, పాటించరు. తల్లే దైవం అంటారు..
ఆడదాని గురించి ప్రతి ఒక్కరు సూక్తులు చెప్తారు కానీ, పాటించరు. తల్లే దైవం అంటారు.. కానీ ఆమెను గౌరవించరు. మహిళలు లేకపోతే అసలు ప్రపంచం ఎక్కడిది అని అంటారు. కానీ, వారినే చిన్నచూపు చూస్తారు. ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. ఆడవారు ఎంత బయటకు వచ్చినా.. మగవారితో సమానంగా పనిచేస్తున్నా.. వారిని ఇంకా తక్కువగానే చూస్తున్నారు. ఇది కేవలం బయట మాత్రమే జరగడం లేదు. ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రేమమ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టుతో.. కలువల్లాంటి కళ్లతో మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారుకు అనుపమ తెగ నచ్చేసింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పిస్తూ తెలుగు ఆడపడుచుల మారిపోయింది. గ్లామర్ ఒలకబోయని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ .. ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ లో అందాల ఆరబోత చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి అనుపమ కష్టపడుతుంది. అందులో.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే చేసింది. ఫ్రీడమ్ అటు మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్, బటర్ ఫ్లై అనే సినిమా లో ప్రధాన పాత్రలో నటించింది.ఇవేమి అమ్మడికి కలిసి రాలేదు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం రెండు డిఫరెంట్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అందులో ఒకటి పరదా అయితే.. ఇంకొకటి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ అనే చెప్పొచ్చు. ఇక పరదా సినిమాపైనే టాలీవుడ్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా సినిమా ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్నటికి నిన్న పరదా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ ఈవెంట్ లో అనుపమ.. ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలపై చిన్న చూపుచూస్తున్నారని తెలిపింది. హీరోయిన్ సినిమాలు అనేసరికి ఎవరు సినిమాలు చూడడం లేదని తన భాదను వెళ్లగక్కింది.
‘ జనవరిలో పరదా గురించి మాట్లాడుకున్నాం. మళ్లీ ఆరునెలలు పట్టింది మాట్లాడడానికి.. మంచి రిలీజ్ డేట్ దొరికేవరకు ఆగాలి. అంతకుమించి ఏం చేయగలం. ప్రతిసారి రిలీజ్ డేట్ అనుకోని ప్రమోషన్స్ కు వచ్చేసరికి వేరే సినిమాలు వచ్చేస్తాయి. పెద్ద సినిమాలు వస్తే.. మాకు థియేటర్లు దొరకవు కాబట్టి మేము ఆగిపోతున్నాం. చాలారోజుల నుంచి ఇదొక లూప్ లో జరుగుతుంది. నిజం చెప్పాలంటే.. ఒక అమ్మాయి సినిమా పోస్టర్ వచ్చింది అంటే అందరూ వెనక్కి వెళ్లిపోతున్నారు. నిర్మాతలు, ఓటీటీలు, ప్రేక్షకులు.. అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా కూడా అది అంతే. అది తప్పని నేను చెప్పడం లేదు. కానీ, అదే రియాలిటీ. ఆ రియాలిటీ చెక్ చేసుకోవడానికి నాకు వచ్చిన సినిమా పరదా. ఈ సినిమా సమయంలోనే నేను ఇదంతా చూసాను. మా టీమ్ చాలా కష్టపడింది. కానీ, రిలీజ్ కు ఇంత టైమ్ పట్టింది. మంచి సినిమా.. థియేటర్ లో చూడండి ‘ అని చెప్పుకొచ్చింది.
పైకి కనిపించకపోయినా అనుపమ పడే భాద అందరికీ తెలుస్తోంది. హీరోయిన్స్ సినిమా అనగానే అంత చిన్నచూపు ఎందుకు అని ఆమె అడిగింది. ఇక ఇండస్ట్రీలో ఈ సమస్యను ఎదుర్కొంది కేవలం అనుపమ మాత్రమే కాదు.. చాలామంది హీరోయిన్స్ కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారు. అనుష్క నయనతార, త్రిష, సమంత, కాజల్.. ఇలా వీరి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసినప్పుడు కూడా వారు కూడా ఇదే ప్రాబ్లెమ్ ను ఎదుర్కొన్నారు. కొన్ని కథల వలన హిట్ అవ్వగా.. మరికొన్ని థియేటర్ లో నిలబడలేక ప్లాప్ అయ్యాయి. ఇక అనుపమకు కూడా నెటిజన్స్ ఇదే చెప్పుకొస్తున్నారు. ఈ ఇబ్బంది స్టార్ హీరోయిన్స్ కే తప్పలేదు.. నువ్వెంత అనుపమ.. కొద్దిరోజులకు నీకే అర్ధమవుతుందిలే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి పరదా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.