Son Murders Mother’s Lover in Karnataka
తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని 16 సార్లు పొడిచి.. బాబోయ్ దారుణం..
కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి సమాచారం అందించాడు.

బెంగళూరు, ఫిబ్రవరి 04: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి.. హత్య గురించి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై కాలుపెట్టి నిలబడి ఉన్నాడు. నడ్డి రోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి జనం వణికిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రం బెలగావి ప్రాంతంలోని బసదోని గ్రామానికి చెందిన బసప్ప హోసమణి(51) పదేళ్ల క్రితం ఓ మహిళతో పారిపోయాడు. వారిద్దరూ కొల్హాపూర ప్రాంతంలో స్థిరపడ్డాడు. అయితే, తన తల్లిని లేపుకుపోవడంతో హోసమణిపై ఇరయ్య మఠపతి పగ పెంచుకున్నాడు. దాదాపు పదేళ్లుగా అదే పగతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే హోసమణి.. బసదోని గ్రామానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం బైక్ పై వెళ్తున్న అతడిని మఠపతి ఆపాడు. అనంతరం బైక్ పైనుంచి కింద పడేసి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్షణాల వ్యవధిలో 16 సార్లు పొడిచాడు.దీంతో బసప్ప అకడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలానే ఈ హఠాత్పరిణామంతో అందరూ షాక్కు గురయ్యారు. ఇక తాను చేసిన హత్యపై నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చే సరికి.. మృతదేహంపై కాలు మోపి నిలబడి ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తల్లితో పారిపోయాడనే కసితో 10 ఏళ్లుగా ఎదురు చూసి.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
