SRSP Canal Water Reaches Arpanapalli
వట్టివాగులోకి చేరిన ఎస్సారెస్పీ జలాలు
అర్పణపల్లి చేరిన ఎస్సారెస్పీ కెనాల్ సాగునీరు
పసుపు కుంకుమలతో స్వాగతం…గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ వీరస్వామి
కేసముద్రం/ నేటి ధాత్రి
ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు నీరందించాలన్న ఆశయంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. యాసంగి పంటలకు గాను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా కాకతీయ మెయిన్ గీసుకొండలోని కాలువ ద్వారా డీబీఎం-40 ఎస్సారెస్పీ కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటితో పరవళ్లు తొక్కింది. గూడూరు మండలంలోని గుండెంగ, గాజులగట్టు, తీగలవేణి గ్రామల మీదుగా కేసముద్రం మండలంలోని అర్పణపల్లి చెరువులు, కుంటల్లోకి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు వచ్చి చేరుతోంది. యాసంగిలో చివరి గ్రామాలకు నీరందించేందుకు ప్రభుత్వ ముఖ్యసల హాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్లు చొరవతో కేసముద్రం మండలంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వార నీరు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదట సారి ప్రభుత్వం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి స్వగ్రామంలో ఊర చెరువు లోకి ఎస్సారెస్పీ నీరు అందడంతో గ్రామస్తులు హార్షం వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ విరస్వామి , ఉపసర్పంచ్ కంచ రాధికా శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామగోని సారయ్య, మాజీ సర్పంచ్ గంధసిరి వెంకన్న, గంధసిరి వెంకటద్రి చీర భద్రయ్య,వార్డ్ మెంబెర్ చీర బుచ్చివీరం, తగురు వెంకటనర్సు, సాయిబాబా, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
