
SS Kashinath
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై కాశీనాథ్ తెలిపారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి యువత మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ అన్నారు. రంజోల్ గ్రామంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ సహకారంతో రంజోల్ వాకింగ్ వారియర్స్ పేరుతో 25 మంది యువకులకు వాకింగ్ షూస్ తో పాటు టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు _ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు టీ షర్ట్లు షూస్ పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. మత్తు పదార్థ వినియోగం సరదాగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనానికి దారితీస్తుందన్నారు. మత్తు పదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానికరమని, వినియోగించే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండేందుకువాకింగ్ తో పాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి టీషర్టులతో పాటు షూస్ అందించడం జరుగుతుందని తెలిపారు.