
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాద రావు జన్మదినోత్సవాన్ని అధికారికంగా ఎస్టిపిపి లో నిర్వహించడమైనది. ఎమ్. ఎన్. వి. రమణ ఏజిఎం , ఎఫ్ జి డి ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాద రావు1991 నుండి 1995 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సభాపతిగా బాధ్యతలు నిర్వహించాలని ఆ సమయంలో వారు సభను చాలా హుందాగా నిర్వహించారని అలాగే అనేక చారిత్రాత్మక బిల్లులను పాస్ చేయించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి అధికారులు, ఏఐటీయూసీ సంఘం అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్, పిట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, పర్సనల్ మేనేజర్ రామా శాస్త్రి ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.