చందుర్తి, నేటిధాత్రి:
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నమస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు… అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ప్రారంభించారు.. ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.