
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన సీపీఐ నాయకులు
చేర్యాల నేటిధాత్రి…
నిరంతరం జనం కోసం, జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేస్తున్న టీ.యూ.డబ్ల్యూ.జే. ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియామకం కావడం హర్షణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బగ్ ప్రెస్ క్లబ్ లో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరాడంబరుడు అయిన శ్రీనివాసరెడ్డి ప్రతీ జర్నలిస్టు పిలిస్తే పలికే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన నియామకానికి కృషి చేసిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి, కేబినెట్ మంత్రులుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా అకాడమీ చైర్మన్ గా చేసిన అనుభవాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, డివిజన్ నాయకుడు వలబోజు నర్సింహా చారి, బండారి సిద్దయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు రాళ్లబండి శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.