మరిపెడ నేటి దాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేస్తున్న కె శ్రీనివాసుకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణా విధానములో ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ, యూ ఎస్ వారి డాక్టరేట్ ను పొందారని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ ప్రేమలత తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీనివాసును కళాశాలలో సన్మానించారు. ప్రిన్సిపాల్ ప్రేమలత మాట్లాడుతూ, మన పరిధిలోని పనిని నిజాయితీగా, నిరంతరంగా చేసుకుంటూ పోతే ఇలాంటి అవార్డులు వరిస్తాయని, మనం చేసిన పనికి గుర్తింపు పొందడం సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ అవార్డును ప్రోత్సాహకంగా తీసుకుని మరింత బాధ్యతగా పనిచేయాలని శ్రీనివాసుకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు డాక్టర్ ఎ కవిత,ఎ జె రామారావు, టి. వెంకన్న,జి.లక్ష్మణ్, యం. నాగలక్ష్మి,యం వీరన్న,టి కేదారి,జి వెంకట్ రెడ్డి,ఆఫీస్ సిబ్బంది యస్ కె యాకూబ్, యం రమ,జె కొమురయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.