కాంగ్రెస్ పార్టీకి రాజీనామా శ్రీకాంత్ సాగర్.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రామాయంపేట మండల యూత్ అధ్యక్షునిగా శ్రీకాంత్ సాగర్ రాజీనామా…
మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కేసిఆర్ అడుగుజాడలలో నడుస్తూ ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం.బిఆర్ఎస్ పార్టీలో ఉండి 2014 , 2018లో పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పద్మాదేవేందర్ రెడ్డి ని గెలిపించుకోవడం కోసం మా వంతు కృషి చేసి భారీ మెజార్టీ తో గెలిపించుకోడం జరిగింది.
పార్టీలో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను నా పనినీ చూసి నాకు మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రామాయంపేట మండల యూత్ అధ్యక్షునిగా నియమించారు. తదుపరి కార్యాచరణలో పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుండి రైతు ధర్నా రైతు దీక్ష లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వార కార్యక్రమాలు నిర్వహిస్తామని
మార్చ్14 రోజున చెప్పడంతో ఏదైనా ప్రజలకు మంచి చేసే పని అనీ మా టీం అందరం ముందుకీ రావడం జరిగింది.పార్టీ లైన్ కాకుండ వ్యక్తీ పరంగా వెళ్తున్నాను అనీ పార్టీ యూత్ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నన్ను తొలగించడం జరిగింది. అయినా సరే వెనకడుగు వేయకుండా MSSO ద్వార రామయంపేట మండలం తో పాటు నియోజకవర్గంలోని యువత అందరం సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి నాకు ఏప్రిల్ 25 న MSSO మండల యూత్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇన్ని రోజులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నం కొన్ని రోజులకి బిఆర్ఎస్ పార్టీ టికెట్ స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి కేటాయించడం మైనంపల్లి హనుమంతరావు తిరుపతి లో ఘాటు వాక్యాలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఇటీవల మైనంపల్లి హనుమంతరావు వారి కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.మా రాజీనామాకు ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు నెరవేర్చకపోవడం అనేది మాకు బాధ కలిగించింది. ఏదైతే హామీ ఇచ్చారో ఆ పనులు చెయ్యమని చెప్పినప్పుడల్ల ఆ మాటను దాటి వేయడం జరుగుతూనే వస్తుంది. గత ఆరు నెలల నుండి చెప్పింది ఎక్కువ చేసింది తక్కువ
కానీ ఏమీ అయినా స్పీచ్ లో మాత్రం చెప్పడం కాదు చేతలలో చూపిస్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.ఇప్పుడు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గా మారింది మా అక్కన్నపేట గ్రామంలో బోర్లు వేశారు కానీ బోరు మోటర్లు దిక్కులేవు.మా గ్రామంలో 35 మందికి అనాధ పిల్లలకి ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఉసే లేదు ఇంకా చాలా చేస్తామని మా అక్కన్నపేట గ్రామ ప్రజలకు వచ్చినప్పుడు హామీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చాలేక పోవడం మా అందరినీ బాధించింది. వ్యక్తులను బట్టి అక్కడ ప్రవర్తన మొదలైంది. కావున మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రామాయంపేట మండల యూత్ అధ్యక్షునిగా రాజీనామా చేస్తున్నాను.మాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!