ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
వరంగల్ నేటిధాత్రి
వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు