
Sri Veeranjaneyareddy Sangha.
శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.