
శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి
మహాదేవుడికి మారేడు దళముల పూజ
సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శ్రావణమాసం శుక్ల పక్షం దశమి సోమవారం పర్వదిన సందర్బంగా శ్రీ ఉమామహేశ్వరసేవ సమితి ఆధ్వర్యంలో శువుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళములను సేకరించి ఆలయ పూజారులు లంక కిషన్ శర్మ చే బిల్వపూజ స్వామి వారికి జరిపించారు.శ్రావణమాస రెండవ సోమవారం అయినందునా భక్తులు మహా దేవుడికి చందన అభిషేకం అర్చనలు చేయడం.
వచ్చిన భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారాని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. పూజ కార్యక్రమంలొ మాజీ సర్పంచ్ రాచకొండ లావణ్య గోపాల్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆరెందల శంకరయ్య మున్నూరు కాపు సంఘం నాయకులు బాపని సాంబయ్య శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఏజన్సిస్ దూడ సతీష్ కుమార్ సేవ కమిటీ సభ్యులు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు గందే ప్రకాష్ మాదారపు వెంకటేశ్వర్లు ఆకుల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.