
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ కాలనీలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళ, బుధవారాలలో వేద పండితుల చేత మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి ఆశనోళ్ల వెంకటేష్ గౌడ్, కోశాధికారి రామేశ్వరం రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేశం ముదిరాజ్, సంయుక్త కార్యదర్శి మహేష్ కురుమ, కార్యవర్గ సభ్యులు సంతోష్ కురుమ, రమేష్ బాబు కాలనీవాసులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు.