సోమవారం రోజున విద్యా సంవత్సర ప్రారంభం సందర్భంగా ఎలుబాక వరప్రసాద్ అయ్యగారు ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి హోమము మరియు వాహనాల పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా కార్యదర్శి శ్రీ తేళ్ళ రాజమౌళి గారు,పాఠశాల సమితి కార్యదర్శి శ్రీ ఆకుల రాజేందర్ గారు, ప్రబంధకారిని అధ్యక్షులు శ్రీ శీలం శ్రీనివాస్ గారు, కార్యదర్శి దాసరి రవీందర్ గారు, డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీమన్నారాయణ గారు, శ్రీ విద్యారణ ఆవాసం గురుకుల విద్యాలయం ప్రధానచారి పోల్సాని సుధాకర్ రావు గారు, బచ్చు శివకుమార్ గారు, శ్రీ దొంతుల రాజకుమార్ గారు, శ్రీమతి గర్రెపల్లి నిరుపారాణి గారు, శ్రీ బాదం రమేష్ గారు,శ్రీ కొదురుపాక హరిప్రసాద్ గారు, పేరెంట్స్ మరియు పాఠశాల ఆచార్య బృందము మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ గుడికందుల సుదర్శన్ గారు తెలిపినారు.