శ్రీరేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ జాతర సందర్బంగా శ్రీ రేణుక మాత ను గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ నాయకులు దర్శనం చేసుకొని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ రేణుకా మాత ఆశీస్సులు ప్రతి ఒక్క గౌడ బిడ్డకు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం తోటి సుఖశాంతులు ప్రజలకు వెదజల్లాలని, అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆభగవంతుని ప్రార్థించారు.
ఎంతో నిష్టతో చేసే రేణుకా మాత బోనాల కార్యక్రమాలు ఘనంగా బొమ్మకల్ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈసంవత్సరం రేణుకా మాత ఆశీర్వాదంతో గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలు అందించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ మండలం అధ్యక్షులు బుస శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.