శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 18 వ కళ్యాణ మహోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామంలో
శ్రీ రేణుక ఎల్లమ్మ 18 వ కళ్యాణ మహోత్సవం నిర్వాహకురాలు శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది . తేదీ 6 7 గురు శుక్రవారం రోజున అమ్మవారి కళ్యాణం బోనాల ఊరేగింపు పోతురాజుల విన్యాసాలు గొల్ల బిర్లా ఆటపాట ఒగ్గు కథ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారి కుమారుడు డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు ధన్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొంటారని వారు తెలియజేశారు.