మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బేరుగు లచ్చినర్సయ్య ఇటీవల గుండెపోటు తో మరణించాడు. వారి కుటుంబాన్ని శుక్రవారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ కలసి 25 కేజీ ల బియ్యం,2500 రూపాయలు ఆర్ధిక సాయాన్ని బాడిశ నాగరమేష్ వారి కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమం లోగ్రామస్థులు మనుబోతుల రామకృష్ణ,మండల సంతోష్,గాజర్ల రవితేజ,గొల్లమూడి సుధీర్,మినుగు సాయి కుమార్,మనుబోతుల ప్రేమ్ కుమార్,మండల సత్యం మరియు ట్రస్ట్ సభ్యులు ఇందారపు రమేష్,మునిగెల మహేష్,కొమరం నితిన్ తదితరులు పాల్గొన్నారు.