
Celebrations.
నా పాక ఆలయ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో గల అతి ప్రాచీన గల నాపాక దేవాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు, ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయం అని తెలిపారు ఈ ఆలయంలో రానున్న రోజుల్లో భూపాలపల్లి శాసనసభ్యుడు సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మంది కళాకారులచే కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండలాల్లోని వివిధ గ్రామాల భక్తుల ప్రజలు సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కృతజ్ఞతలు కాగలరని తెలిపారు.