– మార్చి 19 నుండి 23 వరకు
– యూత్ అధ్యక్షులు బాడిషా ఆదినారాయణ
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీ నాగులమ్మ దేవత మహా జాతర ఈనెల 19 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని బ్రాహ్మణపల్లి యూత్ అధ్యక్షుడు బాడిషా ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు బ్రాహ్మణపల్లి గ్రామంలో వెలసి స్థిరపరచుకున్న మహాతల్లి అయినా శ్రీ ఆదిశక్తి అయినా శ్రీ నాగులమ్మ తల్లిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు సంతాన ప్రాప్తి సర్వరోగ నివారిణి ఐశ్వర్య ప్రాప్తి సకల సౌభాగ్యాలు కలుగుతాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ నాగులమ్మ తల్లినీ దర్శించుకుని నాగులమ్మ మహా జాతరను విజయవంతం చేయాలని భక్తులను కోరారు.